ఐపీఎల్ 224 ఫైనల్: వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే టైటిల్ ఆ జట్టుదే..!

ఐపీఎల్ 2024 చివరి అంకానికి చేరుకుంది. లీగ్ స్టేజీలో దుమ్ము దులిపి పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన కలకత్తా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరుకున్నాయి.

Update: 2024-05-25 12:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 చివరి అంకానికి చేరుకుంది. లీగ్ స్టేజీలో దుమ్ము దులిపి పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన కలకత్తా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ మే 26న చెన్నై లోని చపాక్ స్టేడియంలో జరగనుంది. అయితే కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో మ్యాచ్ నిర్వాహణపై ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే.. బీసీసీఐ రిజర్వ్ డే అందుబాటులో ఉంచింది. రేపు వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. 27 మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజు కూడా వర్షం తగ్గకపోతే లీగ్ స్టేజీలో అత్యధిక పాయింట్లతో ఉన్న జట్టును ట్రోఫీ విజేతగా ప్రకటించనున్నారు.

అంటే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న కలకత్తా నైట్ రైడర్స్ జట్టు 2024 ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకొనుంది. ఇదిలా ఉంటే ఇటీవల బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడినప్పటికీ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనే అధికంగా ఉంది. అలాగే ఈ తుఫాను కారణంగా మ్యాచ్ జరిగే చెపాక్ స్టేడియం ప్రాంతాల్లో ఎటువంటి ఎఫెక్ట్ లేదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అలాగే రేపటి రోజు చెన్నైలో కేవలం 3 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దీంతో మే 26న ఐపీఎస్ 2024 ఫైనల్ పూర్తవడంతో పాటు.. టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారో తెలుస్తుందని.. ప్రేక్షకులు వర్షంపై ఎటువంటి భయం పెట్టుకోవద్దని విశ్లేషకులు తెలుపుతున్నారు.

Similar News