IPL 2023: నేడు డబుల్ ధమకా.. లక్నోతో చెన్నై, పంజాబ్‌తో ముంబై ఢీ..

Update: 2023-05-02 18:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా డబుల్ ధమకా మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లక్నో వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. రెండో మ్యాచ్‌లో మొహాలీ వేదికగా.. పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ ఢీ కొట్టబోతున్నది. లక్నో వేదికగా మొదటి మ్యాచ్‌లో.. పాయింట్ల పట్టికలో 3 వ స్థానంలో ఉన్న లక్నో, 4 వ స్థానంలో ఉన్న చెన్నైని ఢీ కొట్టబోతున్నది. లక్నో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లో 5 గెలిచింది. చెన్నై జట్టు 9 మ్యాచ్‌ ఆడగా 5 గెలిచింది. రన్‌రేట్ విషయంలో లక్నో జట్టు, చెన్నై కంటే మెరుగా ఉండటంతో టేబుల్‌లో 3 వ స్థానంలో ఉంది.

రెండో మ్యాచ్‌లో టేబుల్‌లో 6 వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. 7వ స్థానంలో ఉన్న ముంబైతో తలపడనుంది. పంజాబ్ టేబుల్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లు విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‌లు ఆడగా.. 4 మ్యాచ్‌లో గెలిచింది.

Tags:    

Similar News