విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన వార్నర్.. తొలి విదేశీ ప్లేయర్‌గా..
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. అయితే ఒంటరి పోరాటం చేసిన తన జట్టును గెలిపించలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 6,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా వార్నర్ నిలిచాడు. ఐపీఎల్‌లో 6 వేలు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనతను వార్నర్ 165 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
ఈ రికార్డు గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కింగ్ కోహ్లీ 188 ఇన్నింగ్స్‌ల ద్వారా ఈ ఘనత సాధించాడు. రాజస్థాన్‌పై వార్నర్ తన ఐపీఎల్ కెరీర్‌లో 57వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 44 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు.
We hope this 𝐁𝐮𝐥𝐥 𝐫𝐮𝐧 carries on for a long time 💪#YehHaiNayiDilli #IPL2023 #RRvDC @davidwarner31 pic.twitter.com/Hja8gycOTj
— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2023