గైక్వాడ్ ఒంటరి పోరాటం.. పంజాబ్ ముందు యావరేజ్ టార్గెట్

ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు 49వ మ్యాచ్ చెన్నై, పంజాబ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది.

Update: 2024-05-01 15:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు 49వ మ్యాచ్ చెన్నై, పంజాబ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. కాగా వెంట వెంటనే వికెట్లను కోల్పోవడంతో చెన్నై జట్టు పరుగులు చేయడంతో ఇబ్బంది పడింది. ఓపెనర్ గైక్వాడ్ మొదటి నుంచి ఒంటరి పోరాటం చేశాడు. 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చెన్నై బ్యాటర్లలో రహానే 29, రిజ్వి 21, అలి 15, ధోని 14 పరుగులతో రాణించారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో బ్రార్, చాహర్ 2 వికెట్లు తీసుకోగా, రబాడ, అర్షదీప్ ఒక్కొ వికెట్ తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో పంజాబ్ జట్టు గెలవాలంటే 120 బంతుల్లో 163 పరుగులు చేయాల్సి ఉంది. తగ మ్యాచులో 261 పరుగులు చేదించిన పంజాబ్ జట్టు ఈ యావరేజ్ టార్గెట్ ను చేదిస్తుందా.. లేక చెన్నై బౌలర్ల ధాటికి ఓడిపోతుందా తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

Similar News