లక్నోతో మ్యాచ్‌లో ధోనీ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?.. అది చూసి నమ్మలేకపోయానన్న లక్నో కోచ్

టీమ్ ఇండియా, చెన్నయ్ సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Update: 2024-05-25 13:41 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా, చెన్నయ్ సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐపీఎల్-17లో భాగంగా చెన్నయ్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా జట్టుతో సంబంధం లేకుండా అభిమానులు స్టేడియాలకు పోటెత్తారు. ఎల్లో జెర్సీలతో స్టేడియాలు పసుపుమయం అయ్యాయి. గత నెల 19న లక్నోలోని ఎకానా స్టేడియంలో చెన్నయ్, లక్నో తలపడ్డాయి. స్టేడియం కెపాసిటీ 50 వేలు. 48 వేల మంది ధోనీ నం.7 జెర్సీలనే ధరించారట.

ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘సీఎస్కేతో రెండుసార్లు ఆడాం. మొదట వారు లక్నోకు వచ్చారు. ఎకానా స్టేడియం కెపాసిటీ 50 వేలు. నిజాయతీగా చెప్తున్నా. 48 వేల ధోనీ నం.7 షర్ట్స్ కనిపించాయి. ఆ తర్వాత మేము చెన్నయ్‌కు వెళ్లాం. అక్కడ 98 శాతం కాదు.. 100 శాతం ధోనీ షర్ట్సే ఉన్నాయి. నేను ఇది నమ్మలేకపోయా. భారత్‌లో హీరో ఆరాధన నమ్మశక్యం కానిది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, చెన్నయ్‌తో తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ లక్నోనే విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నయ్, లక్నో 5వ, 7వ స్థానాలతో లీగ్ స్టేజ్‌కే పరిమితమయ్యాయి. 

Similar News