IPL కు దినేష్ కార్తీక్ రిటైర్మెంట్.. విరాట్ కోహ్లీ భావోద్వేగ కౌగిలింత..!

బుధవారం ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్.. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

Update: 2024-05-23 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్.. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచులో ఓటమి తర్వాత కోహ్లీ డీకేని హత్తుకుని వీడ్కోలు పలికాడు. ఓటమి అనంతరం జట్టు ప్లేయర్లు అందరూ డీకేకి అభివాదం తెలిపారు. అలాగే దీనేష్ కార్తీక్ కూడా మైదానం చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులు కృతజ్ఞతలు తెలపడం వీడియోలో కనిపించింది. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆర్సీబీ, డీకే అభిమానులు.. వీడియోను షేర్ చేస్తూ.. డీకే నువ్వు మా హీరోవు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా దీనేష్ కార్తీక్ మాత్రం అధికారికంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు తెలపనప్పటికి మ్యాచ్ అనంతరం దృష్యాలు అతని రిటైర్మెంట్ పై ఊహాగానాలు బలపరుస్తున్నాయి.

Click Here For Twitter Post..

Tags:    

Similar News