అమెరికాకు భారత ఆటగాళ్లు.. కోహ్లీ వెళ్లాడా?..లేదా?

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-25 16:50 GMT

దిశ, స్పోర్ట్స్ : అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో టీమ్ ఇండియా తన గ్రూపు మ్యాచ్‌లను అమెరికాలో ఆడనుంది. వచ్చే నెల 5న ఐర్లాండ్‌తో టోర్నీని మొదలుపెట్టనుంది. ప్రస్తుతం ఐపీఎల్-17 జరుగుతున్న నేపథ్యంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు రెండు బ్యాచ్‌లుగా అమెరికాకు వెళ్లనున్నారు. తొలి బ్యాచ్‌లో భాగంగా పలువురు ప్లేయర్లు శనివారం అమెరికాకు బయల్దేరారు.

కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ దూబె, జడేజా, జస్ప్రిత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్ వెళ్లిన వారిలో ఉన్నారు. ముంబై నుంచి కనెక్టెడ్ ఫ్లైట్‌లో వాళ్లు బయల్దేరగా.. దుబాయ్‌లో కాసేపు ఆగి న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆటగాళ్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో విరాట్ కోహ్లీ కనిపించలేదు. తొలి బ్యాచ్‌లో అతను వెళ్లాల్సి ఉండగా.. అతను వెళ్లాడా?లేదా? అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 27న రెండో బ్యాచ్‌లో జైశ్వాల్, సంజూ శాంసన్‌, చాహల్, రింకు సింగ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ న్యూయార్క్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం లండన్‌లో ఉండగా జట్టుతో కలవనున్నాడు. 

Tags:    

Similar News