టీ20 ప్రపంచకప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదే

టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే పాక్ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) శుక్రవారం ఎట్టకేలకు ప్రకటించింది.

Update: 2024-05-24 17:02 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే పాక్ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) శుక్రవారం ఎట్టకేలకు ప్రకటించింది. ఇప్పటికే భారత్‌ సహా మిగతా జట్లు ఖరారవ్వగా.. పీసీబీ ఆలస్యంగా జట్టును ఎంపిక చేసింది. పొట్టి ప్రపంచకప్‌లో పాక్ జట్టును బాబర్ ఆజామ్ నడిపించనున్నాడు. అయితే, వైస్ కెప్టెన్ ఎవరన్నది స్పష్టతనివ్వలేదు. గాయం కారణంగా ఫిబ్రవరి నుంచి జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ హరిస్ రవూఫ్‌ అందుబాటులోకి వచ్చాడు.

అలాగే, ఇటీవల రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న మహమ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్‌లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. 2011లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు అమీర్ మూడు నెలల శిక్ష అనుభవించాడు. అలాగే, ఐసీసీ అతన్ని ఐదేళ్లపాటు బ్యాన్ చేయగా..2016లో నిషేధం ముగిసింది. ఇటీవల ఐర్లాండ్ టూరుతో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌ టూరుకు ఎంపికైన ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ అఘా, పేసర్ ఇర్ఫాన్ ఖాన్, హసన్ అలీలకు జట్టులో చోటు దక్కలేదు. అబ్రార్ అహ్మద్, అజామ్ ఖాన్, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ తొలి ప్రపంచకప్‌కు ఎంపికవ్వగా.. టీ20 ప్రపంచకప్-2022 ఆడిన 8 మంది ఆటగాళ్లు ఈ ప్రపంచకప్‌ ఆడబోతున్నారు.

పాకిస్తాన్ జట్టు : బాబర్ ఆజామ్(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అజామ్ ఖాన్, ఫకర్ జమాన్, హరిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, అబ్బాస్ అఫ్రిది, అమీర్, రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ ఆయుబ్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్. 

Tags:    

Similar News