గుండెపోటుతో ఉపాధి హామీ కూలి మృతి

మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామానికి చెందిన భూమని రాములు (70) అనే ఉపాధి హామీ కూలి గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

Update: 2024-05-04 06:14 GMT

దిశ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామానికి చెందిన భూమని రాములు (70) అనే ఉపాధి హామీ కూలి గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భూమని రాములు శనివారం ఉదయం జప్తి జానకంపల్లి గ్రామ శివారులోని మల్లార్ చెరువులో ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. ఉపాధి హామీ పనులు ప్రారంభించడానికి ముందే రాములు కు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల వద్ద గుండెపోటుతో రాములు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతునికి భార్య సాయవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల వద్ద ఉపాధి హామీ కూలీ రాములు మృతి చెందడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి రాములు మృతికి గల కారణాలు తెలుసుకొని పంచనామ నిర్వహించారు. ఉపాధి హామీ కూలీ భూమని రాములు గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు ప్రజా ప్రతినిధులు సంఘటనకి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Similar News