గుర్తు తెలియని మృతదేహం లభ్యం..

జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండలం, నల్లగొండ గ్రామ శివారు

Update: 2024-04-18 16:33 GMT

దిశ, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.స్థానిక ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ గ్రామ శివారులో మామిడి తోట పక్క గుట్టపైన గుర్తు తెలియని మృతదేహం గురువారం రోజున లభ్యమైందనీ మృతుని వయస్సు 45 సంవత్సరాలు ఉంటుందని అన్నారు.గ్రామ ప్రత్యేక అధికారి పల్లె ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News