చెట్టు కూలి ఇద్దరు వ్యక్తులు మృతి

చెట్టు కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్

Update: 2024-05-26 15:15 GMT

దిశ,కీసర: చెట్టు కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రాంరెడ్డి, ధనుంజయ్ లు బైక్‌పై వెళుతుండగా చెట్టు కూలి నాగిరెడ్డి రాంరెడ్డి (58) అక్కడిక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ధనుంజయ్(44) లకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కీసర లో గాలి వాన బీభత్సం..పలు చోట్ల రోడ్డుపై విరిగిపడిన చెట్లు..కూలిన చిరువ్యాపారుల సముదాయాలు

కీసర మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కీసర తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కాగా కీసరలో ఈదురు గాలులు, గాలి వాన దుమారానికి పలు చోట్ల చెట్లు విరిగి రోడ్డు మీద పడటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కీసర ప్రధాన చౌరస్తాలో చిరు వ్యాపారుల సముదాయాలు కుప్పకూలిపోయాయి.

Similar News