కారు, ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు మృతి

బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టినగర్ గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Update: 2024-05-26 16:08 GMT

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టినగర్ గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాల్వంచ మండలం గుడిపాడుకు చెందిన శెట్టిపల్లి నర్సింహారావు(18)తన స్నేహితుడు కణితి హర్షవర్ధన్​ తో  కలిసి ద్విచక్రవాహనంపై బూర్గంపాడు మండలంలోని కృష్ణసాగర్ గ్రామంలో బంధువుల ఇంటి వద్ద జరిగిన కర్మలకు హాజరయ్యారు. కర్మల అనంతరం తిరిగి ద్విచక్రవాహనంపై గుడిపాడు స్వగ్రామానికి వెళ్తుండగా పినపాక పట్టీనగర్ వద్ద కిన్నెరసాని

    బ్రిడ్జికి చేరుకోగానే పాల్వంచ వైపు నుంచి భద్రాచలం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనం నడుపు తున్న శెట్టిపల్లి నర్సింహారావు అక్కడికక్కడే మృతి చెందగా,స్నేహితుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ సంఘటన సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ ను స్థానికుల సహాయంతో పాల్వంచ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Similar News