సంబురం జరగాల్సిన ఇంట్లో విషాదం

కూతురు పుట్టు వెంట్రుకలకు బట్టలు కొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైన ఘటన మెదక్ మండలం మంబోజీ పల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగింది.

Update: 2024-05-22 15:18 GMT

దిశ, మెదక్ ప్రతినిధి : కూతురు పుట్టు వెంట్రుకలకు బట్టలు కొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టిన ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైన ఘటన మెదక్ మండలం మంబోజీ పల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు... వెల్దుర్తి మండలం దామరంచకు చెందిన శంభు నర్సింలు(24), భార్య మౌనిక, తల్లి ఎల్లవ్వ తో కలిసి కుమార్తె కు బట్టలు కొనేందుకు మెదక్ పట్టణానికి వచ్చారు. షాపింగ్ పూర్తయిన తరువాత

    మోటార్ బైక్ పై తిరిగి వెళ్తుండగా మంబోజి పల్లి ఎల్లమ్మ గుడి సమీపంలో ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింలు అక్కడిక్కడే మృతి చెందగా భార్య మౌనిక, తల్లి ఎల్లవ్వ కు గాయాలయ్యాయి. మౌనిక పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుమార్తెకు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నర్సింహులు మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధులు ఆసుపత్రి వద్ద బోరున విలపించారు.

Similar News