ఏలూరు జిల్లాలో విషాదం.. ఉమ్మెత్త కాయలు తిని చిన్నారులకు అస్వస్థత

ఉమ్మెత్త కాయలు తిని చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన ఏలూరు జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరంలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-01-24 13:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మెత్త కాయలు తిని చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన ఏలూరు జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొంతమంది చిన్నారులు తెలిసీ తెలియక ఉమ్మెత్త కాయలను తిన్నారు. దీంతో ఎనమిది మంది చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతగు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడఎ తరలించారు. ఎనమిది మంది చిన్నారుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.   

Tags:    

Similar News