మహిళ మృతదేహం లభ్యం

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(35) మృతదేహం లభ్యమైనట్లు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Update: 2024-05-23 09:36 GMT

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(35) మృతదేహం లభ్యమైనట్లు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలికి సుమారుగా 35 ఏళ్ల వయసు ఉంటుందని, ఆమె ఒంటిపై గులాబీ రంగు చీర, బంగారు రంగు జాకెట్ ధరించి ఉన్నాయని,

    అలాగే నలుపు రంగు స్కార్ప్ కూడా ఉన్నట్లు సీఐ వెల్లడించారు. కాగా మహిళ అటవీ ప్రాంతానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నదా లేక ఎవరైనా చంపేసి ఆచూకీ తెలియకుండా మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళను గుర్తించిన వారు తమకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. 

Similar News