యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా..

ఈత సరదా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది.

Update: 2024-05-24 12:03 GMT

దిశ, నవాబుపేట : ఈత సరదా ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన మంగలి హరిబాబు కుమారుడు ఆంజనేయులు ( 26 ). శుక్రవారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో గల పెద్ద చెరువులో సరదాగా ఈత కొట్టడానికి వెళ్ళాడు. ఈత కొడుతూ నీటి మధ్యకు వెళ్ళిన ఆ యువకుడికి దమ్ము వచ్చి ఊపిరాడక ఊపిరాడక నీటిలో మునిగి పోతుండటం గమనించి అతడితో పాటు ఈత కొడుతున్న యువకులు నీటిలో నుండి పైకి లాగే ప్రయత్నం చేశారు. అతడిని బయటకు లాగేందుకు వారికి కూడా శక్తి సరిపోక పోవడంతో వారందరూ చూస్తుండగానే ఆ యువకుడు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి యువకుడు శవం కోసం చెరువు నీటిలో గాలిస్తున్నారు.

Similar News