బైక్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... వ్యక్తి స్పాట్ డెడ్

బైక్ పై వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీ కొట్టగా వ్యక్తి మృతి చెందిన ఘటన హుస్నాబాద్ లో చోటు చేసుకుంది.

Update: 2024-05-24 14:38 GMT

దిశ, హుస్నాబాద్ : బైక్ పై వెళ్తున్న వ్యక్తిని బస్సు ఢీ కొట్టగా వ్యక్తి మృతి చెందిన ఘటన హుస్నాబాద్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారు కరీంనగర్ రోడ్డులో గల పాలశీతలీకరణ కేంద్రం సమీపంలో హుస్నాబాద్ నుండి కోహెడ మండలం శ్రీరాములపల్లి కి బైక్ పై వెళ్తున్న మహంకాళి రాములు(45) ను

    కరీంనగర్ నుండి హుస్నాబాద్ వస్తున్న హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా బస్సుకు ఉన్న బంపర్ లో ఎడమవైపున బైక్ హ్యాండిల్ చిక్కడంతో సుమారు 100 అడుగుల వరకు బైకు ను లాక్కెళ్లి బస్సు ఆగిపోయింది. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాములు భార్య సంవత్సరం క్రితమే చనిపోగా మృతుడికి ఒక కూతురు ఉన్నట్లు తెలిపారు. 

Similar News