శామీర్ పేటలో దొంగల హల్‌చల్.. మూడిళ్లలో చోరి..

తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు.

Update: 2024-05-24 13:16 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో: తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. వరుస దొంగతనాలతో హడలేత్తిస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ లో దొంగలు రెచ్చిపోయారు. శామీర్ పేట మండలంలోని మజీద్ పూర్ లోని ప్రజయ్ హోమ్స్ లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు తెగబడుతున్నారు. మూడు రోజుల కిందట ప్రణయ్ హోమ్స్ లో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఫంక్షన్ కి వెళ్లాడు.

తిరిగి తన ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. దీంతో ఆందోళనకు గురైన అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూశారు. ఇంట్లో ఉన్న 13 తులాల బంగారం ,రూ. 68 వేలు నగదు కన్పించలేదు. దీంతో అనిల్ యాదవ్ పోలీసులకు సమాచారం అందించారు. తాజాగా మరో రెండు ఇంట్లో షరీఫ్ ,శ్రీనివాస్ ఇంట్లో 30 తులాల బంగారం , రూ. 93 వేల నగదు దొంగలు దోచుకెళ్లారు. దీంతో స్థానికులు వరుస దొంగతనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News