మిస్టరీగా మారిన నర్సింగ్ విద్యార్థిని మృతి

భద్రాచలం పట్టణంలోని మారుతి పారా మెడికల్ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతూ, కళాశాల హాస్టల్లో ఉంటున్న కారుణ్య అనే విద్యార్థిని మృతి మిస్టరీ గా మారింది.

Update: 2024-05-23 16:23 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణంలోని మారుతి పారా మెడికల్ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతూ, కళాశాల హాస్టల్లో ఉంటున్న కారుణ్య అనే విద్యార్థిని మృతి మిస్టరీ గా మారింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విద్యార్థిని రక్తపు మడుగులో పడిపోయి ఉండడం, తోటి విద్యార్థినిలు గమనించి మేనేజ్మెంట్ కు సమాచారం అందించడంతో, హుటాహుటిన గాయపడ్డ విద్యార్థినిని ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్సను అందించారు. తలకు బలమైన గాయం అయిందని, వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నామని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

     కాగా ఇంతలోనే గురువారం రాత్రి 8.30 దాటిన తర్వాత తీవ్ర రక్త స్రావం కారణంగా మృతి చెందింది. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనపై కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావును దిశ వివరణ కోరగా... తెల్లవారుజామున వాష్ రూమ్ కి వెళ్లి నిద్రమత్తులో కింద పడిపోవడం కారణంగా తలకు గాయం అయిందని, వెంటనే ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించామని తెలిపారు. తెల్లవారు జామున ఎవరో ఆగంతకుడు కళాశాలలో ప్రవేశించాడని కొందరు విద్యార్థినిలు పేర్కొనడంతో నర్సింగ్ విద్యార్థిని మృతి మిస్టరీ గా మారింది. పోలీసులు గురువారం ఉదయం నుండి విచారిస్తున్నారు. కారుణ్య మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు తరలించారు.

Similar News