గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

మూసీ నది ఒడ్డున 50 సంవత్సరాల గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని

Update: 2024-05-22 13:00 GMT

దిశ, చార్మినార్​ : మూసీ నది ఒడ్డున 50 సంవత్సరాల గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని చార్మినార్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డీఆర్​ఎఫ్​​ జీహెచ్ఎంసీ ఉద్యోగి అయిన పులికంటి అరుణ్ ప్రతి రోజు హైకోర్టు నుంచి చాదర్​ఘాట్​ ఫ్లై ఓవర్​ వరకు మూసీ నది ట్రాక్​లో పెట్రోలింగ్​ నిర్వహిస్తుంటాడు. మరో జీహెచ్​ఎంసి ఉద్యోగి నేరపాటి సంజయ్​ అతని వద్దకు వచ్చి మూసీ నది ట్రాక్​ వద్ద హైకోర్టు గేట్​ నెంబర్​ 1 వద్ద మూసీ నది ఒడ్డున 50 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందని సమాచారం అందించారు.

దీంతో అరుణ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆమె మెడపై గాయాలు ఉండడంతో అనుమాన స్పద మృతి కింద చార్మినార్​ పోలీసులు కేసులు నమోదు చేశారు. సదరు మహిళ ఎవరని తేలితే సాధారణ మరణమా? అనుమాన స్పద మృతినా? హత్యనా? అన్నది వెలుగులోకి వస్తుందని చార్మినార్​ పోలీసులు తెలిపారు. ఈ కేసును చార్మినార్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News