గుర్తు తెలియని మహిళ శవం లభ్యం

వరంగల్ మహానగర పాలక సంస్థ 16 వ డివిజన్ పరిధిలోని గొర్రెకుంట

Update: 2024-05-10 11:43 GMT

దిశ,గీసుకొండ : వరంగల్ మహానగర పాలక సంస్థ 16 వ డివిజన్ పరిధిలోని గొర్రెకుంట కట్టమల్లన్న చెరువులో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. గీసుకొండ సీఐ ఎల్.పవన్ కుమార్ కథనం ప్రకారం ఈరోజు అనగా 2024 మే 10 రోజు మధ్యాహ్నం 12 గంటలక ఒక గుర్తు తెలియని మహిళ శవం లభ్యమయిందని,ఆమె ఒంటిపై పసుపు రంగు చీర,ఎరుపు రంగు ఆకుపచ్చ చుక్కల జాకెట్,చేతులకి ఎరుపు రంగు గాజులు ఉన్నాయని తెలిపారు. ఈ మహిళ శవం ఆచూకీ తెలిసినవారు 8712685031, 8712685240,8712685250 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవలసినదిగా సీఐ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News