అనుమానాస్పద మృతి.... పూడ్చిన శవానికి పోస్టుమార్టం

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందడంతో పూడ్చిన శవానికి పోస్టుమార్టం చేసిన ఘటన శివ్వంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-05-24 14:55 GMT

దిశ, శివ్వంపేట : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందడంతో పూడ్చిన శవానికి పోస్టుమార్టం చేసిన ఘటన శివ్వంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పోతులబోగూడ గ్రామానికి చెందిన కొల్చేల్మె పోచయ్య (60) అనే వ్యక్తి ఈనెల 8న గ్రామ శివారులోని నీటి గుంతలో పడి మృతి చెందాడు. గుంతలో పడి మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులు సహజ మరణంగా భావించి ఆయన అంత్యక్రియలు జరిపారు. ఇటీవల మృతి చెందిన

    పోచయ్య మరణం పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోచెయ్యను గుర్తుతెలియని రియల్ ఎస్టేట్ వ్యాపారులు హత్య చేసి నీటి గుంతలో పడేశారని అనుమానంతో శివంపేట పోలీసులను ఆశ్రయించారు. తూప్రాన్ సీఐ కృష్ణ ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ చారి పర్యవేక్షణలో సంగారెడ్డికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అజారుద్దీన్ ఆయన బృందం సమాధిలో పూడ్చిన శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. శవానికి పోస్టుమార్టం చేస్తున్న స్థలంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోచయ్య మృతికి గల కారణాలు పోస్టుమార్టం పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం తెలియజేస్తామని ఎస్సై మహిపాల్ రెడ్డి తెలిపారు. 

Similar News