మామిడి తోటలో పండ్లు చోరీ.. ఎస్ఐ సస్పెండ్

మామిడి తోటలో పండ్ల చోరీ కేసును సివిల్ వివాదంగా చూపించి అవకతవకలకు పాల్పడ్డ సబ్ ఇన్స్పెక్టర్ రవికాంత్‌ను శుక్రవారం మల్టీ జోన్-1 ఐజీ

Update: 2024-05-24 15:35 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: మామిడి తోటలో పండ్ల చోరీ కేసును సివిల్ వివాదంగా చూపించి అవకతవకలకు పాల్పడ్డ సబ్ ఇన్స్పెక్టర్ రవికాంత్‌ను శుక్రవారం మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన‌పై బాధితురాలు ఎస్ఐ రవికాంత్‌కు ఫిర్యాదు చేసింది. అతను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన.. అది సివిల్ తగాదా కింద చూపించే ప్రయత్నం చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ నివేదిక మేరకు ఐజీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఎస్ఐ రవికాంత్ సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ భూంపల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News