మనువరాలిపై తాత అత్యాచారం.. విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం కేసులో విశాఖ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వరుసకు తాత అయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ

Update: 2024-05-27 11:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలికపై అత్యాచారం కేసులో విశాఖ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వరుసకు తాత అయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తి 2017లో వరుసకు మనువరాలిపై బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. బాలికపై అత్యచారానికి పాల్పడ్డ వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించడంతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించారు. 

Similar News