విషాదం నింపిన ఈత సరదా

ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొడదామని వెళ్లిన ఓ విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు మిగిలాయి.

Update: 2024-05-24 15:27 GMT

దిశ, నర్సాపూర్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొడదామని వెళ్లిన ఓ విద్యార్థి కుటుంబంలో విషాదఛాయలు మిగిలాయి. వివరాల్లోకెళితే నర్సాపూర్ పట్టణ పరిధిలోని హనుమంతపూర్ గ్రామానికి చెందిన ఆసిఫ్ (12) శుక్రవారం తన స్నేహితులతో కలిసి ఈత కొడదామని గ్రామంలోని చెరువులోకి వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో చెరువులో మునిగిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు గ్రామస్తులకు తెలియడంతో వచ్చి చూసేసరికి చెరువులో మునిగి మృతి చెందాడు. ఆసీస్ ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్నాడు. మృతునికి తల్లిదండ్రులు చాంద్ పాషా, ఉస్మాన్ బి ఉన్నారు. తండ్రి గ్యాస్ రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆసిఫ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Similar News