పనసకాయ లోడు మాటున గంజాయి తరలింపు

పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పోలీసులకు పట్టుబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.

Update: 2024-05-25 16:25 GMT

దిశ, అశ్వారావుపేట : పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పోలీసులకు పట్టుబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. శనివారం విశ్వసనీయ సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా గుడి వద్ద ఎస్సై శ్రీరాముల శ్రీను తన సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్ ధూల్ పేట్ కి బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయి పోలీసులకు చిక్కింది. పనసకాయ లోడు మాటున

     165 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. పట్టుబడిన విక్రమ్ సింగ్, శైలేందర్ సింగ్, చింతమన్ సంతోష్ సింగ్, రామ్ పూరి గోపి సింగ్ లను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఆదిత్య సింగ్, మహేందర్ సింగ్ అనే వ్యక్తులకు అమ్మడానికి గంజాయిని తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న 359 కేజీల గంజాయి విలువ రూ.89 లక్షల 83 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 11 మంది నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. 

Similar News