రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

కొండమల్లేపల్లి నుంచి నాగార్జునసాగర్ వెళ్లే జాతీయ రహదారిపై చిన్న ఆడిశర్లపల్లి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు.

Update: 2024-05-24 15:13 GMT

దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి నుంచి నాగార్జునసాగర్ వెళ్లే జాతీయ రహదారిపై చిన్న ఆడిశర్లపల్లి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దవుర మండలం ఉట్లపల్లి వాసులు పెరిక శీను, కనకయ్య కొండమల్లేపల్లి నుంచి బైక్ పై వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఇద్దరు ఒకరినొకరు ఢీ కొట్టుకోవడంతో.. ఈ ప్రమాదంలో పెరిక శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News