సరిహద్దు రహదారిని మూసివేసిన మావోయిస్టులు.. పోలీసుల రియాక్షన్ ఇదే!

ఛత్తీస్‌‌గఢ్‌లోని దంతెవాడ - నారాయణపూర్ సరిహద్దు రహదారిని మావోయిస్టులు దిగ్భందిచారు. మాలేవాహి పరిధి భార్సూర్ రహదారిపై బుధవారం కందకాలు తవ్వారు.

Update: 2024-03-27 14:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌‌గఢ్‌లోని దంతెవాడ - నారాయణపూర్ సరిహద్దు రహదారిని మావోయిస్టులు దిగ్భందిచారు. మాలేవాహి పరిధి భార్సూర్ రహదారిపై బుధవారం కందకాలు తవ్వారు. అంతేకాదు.. రోడ్డుకు అడ్డంగా చెట్లు నరికి పడేశారు. రహదారిని మూసివేసి బ్యానర్లు కట్టి కపత్రాలు వదిలారు. భద్రతా బలగాలను అడ్డుకోవడానికి మావోయిస్టులు పన్నిన కుట్రగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలోని మహబూబాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 1300 కిలోల పేలుడు పదార్థాలను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు పేలుడు పదార్థాలను ఉపయోగించడానికి తరలిస్తున్నారని అనుమానిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య వరుసగా ఎదురుకాల్పులు చోటుచేకుంటున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఐదారుగురు మావోయిస్టులు హతం అయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News