అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ పరిధిలో గల కొచ్చేర మైసమ్మ ఆలయం సమీపంలో బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కురుపాటి శేఖర్ (45) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు.

Update: 2024-05-24 12:17 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ పరిధిలో గల కొచ్చేర మైసమ్మ ఆలయం సమీపంలో బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కురుపాటి శేఖర్ (45) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ అని, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ

     జీవనం సాగిస్తున్నాడు. దీంతో గురువారం తిమ్మాపూర్ గ్రామానికి విచ్చేసిన ఆయన రాత్రి కొచ్చేర మైసమ్మ ఆలయ సమీపంలోకి వెళ్లి చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ ఐ వివరించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా అస్పత్రికి తరలించామని ఆమె పేర్కొన్నారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారని ఆమె తెలిపారు. 

Similar News