అతిగా సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య

అతిగా సెల్ ఫోన్ వాడుతున్నాడని కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధి తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-04-19 15:08 GMT

దిశ, చార్మినార్ : అతిగా సెల్ ఫోన్ వాడుతున్నాడని కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధి తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహదూర్ పుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కిషన్ బాగ్ కు చెందిన అషితోష్ జాదవ్ (22) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా సెల్ ఫోన్ ఎక్కువగా వినియోగిస్తుండడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని మందలించారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అషితోష్ అతని బెడ్ రూమ్ లో పడుకోవడానికి వెళ్లి గురువారం అర్ధరాత్రి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరునాడు ఉదయం కుటుంబ సభ్యులు ఎంత సేపు పిలిచినప్పటికి డోర్ తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు బహదూర్ పుర పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News