గేమింగ్ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

చత్తీస్ గఢ్ గన్ పౌడర్ ఫ్యాక్టరీ పేలుడు సంఘటన మరువక ముందే దేశంలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Update: 2024-05-25 14:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: చత్తీస్ గఢ్ గన్ పౌడర్ ఫ్యాక్టరీ పేలుడు సంఘటన మరువక ముందే దేశంలో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. టీఆర్సీ గేమింగ్ జోన్ లో ఈ మంటలు చెలరేగగా.. మంటల్లో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ సహా మొత్తం 8 మంది ప్రణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అలాగే గేమింగ్ జోన్ లో మరికొంత మంది ప్రజలు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటల వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News