ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం

కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు వివరాల ప్రకారం.. మల్లేపల్లి నుండి మాచర్ల వెళుతున్న ఆటో పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోసుకొని వస్తుండగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మరియదాసు(57) ఆటో ఆపి డ్రైవర్‌తో మాట్లాడుతున్నారు.

Update: 2024-05-12 02:33 GMT

దిశ, పెద్ద అడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల ప్రధాన రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు వివరాల ప్రకారం.. మల్లేపల్లి నుండి మాచర్ల వెళుతున్న ఆటో పెట్రోల్ బంక్‌లో డీజిల్ పోసుకొని వస్తుండగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మరియదాసు(57) ఆటో ఆపి డ్రైవర్‌తో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆటోను వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మరియదాసు అక్కడికక్కడే మృతిచెందగా.. ఆటోలో ప్రయాణిస్తున్న పది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు క్షతగాత్రులంతా ఏపీకి చెందినవారిగా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యా్ప్తు ప్రారంభించారు. ఢీకొట్టి వెళ్లిన లారీకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. 

Tags:    

Similar News