విద్యుత్ షాక్ తో తల్లాడ మాజీ ఎంపీపీ కాంపల్లి రాము మృతి

విద్యుత్ షాక్ తో తల్లాడ మాజీ ఎంపీపీ కాంపల్లి రాము ఆదివారం రాత్రి మృతి చెందారు.

Update: 2024-05-26 16:24 GMT

దిశ,తల్లాడ : విద్యుత్ షాక్ తో తల్లాడ మాజీ ఎంపీపీ కాంపల్లి రాము ఆదివారం రాత్రి మృతి చెందారు. నారాయణపురంలోని తన స్వగృహంలో బావి దగ్గర విద్యుత్ మోటార్ కు మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో పక్కనే ఉన్న బావిలో పడడంతో తుది శ్వాస విడిచారు. చుట్టుపక్కల వారు విషయం తెలుసుకొని చూడగా అప్పటికే మృతి చెందారు. రాము 2006 సంవత్సరంలో ఎంపీపీగా గెలుపొంది ఐదేళ్లపాటు మండల ప్రజలకు సేవలు అందించారు. ఇటీవల కాలంలో తల్లాడ తొలి ఎంపీపీ రాయల శేషగిరిరావు, ప్రస్తుతం తల్లాడ మాజీ ఎంపీపీ రాము మృతి చెందటంతో మండలంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News