రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి..

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లో అదుపుతప్పి కారు చెట్టును

Update: 2024-05-22 14:56 GMT

దిశ, మేడిపల్లి : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లో అదుపుతప్పి కారు చెట్టును ఢీకొన్న ఘటనలో తండ్రి, కొడుకు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మెట్ పల్లి పట్టణం ఎస్ ఆర్ ఎస్పీ క్యాంప్ కాలనికి చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ ఖైరుద్దిన్( 85), అతని కుమారుడు రశీదుద్దిన్ (60) ప్రభుత్వ టీచర్. వీరిద్దరూ బుధవారం కరీంనగర్ నుంచి మెట్ పల్లి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలోనే వీరు ప్రయాణిస్తున్న కారు మేడిపల్లి మండలం లోని పెద్దమ్మ టెంపుల్ వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కైసరుద్దీన్, రశి దుద్దిన్ లు తీవ్రంగా గాయపడ్డారు. తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జగిత్యాల లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే మార్గమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి కొడుల మరణం తో మెట్ పల్లి పట్టణం ఎస్సారెస్పీ కాలనీలో విషాద చాయాలు అలుముకున్నాయి.

Similar News