వీరన్నగుట్టలో ఒకేరోజు తండ్రి, కుమార్తె మృతి.. అంతా నిమిషాల వ్యవధిలోనే!

నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో ఒకేరోజు తండ్రి, కుమార్తె మృతిచెందారు.

Update: 2024-05-24 11:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో ఒకేరోజు తండ్రి, కుమార్తె మృతిచెందారు. భర్త వేధింపులు తట్టుకోలేక ఈనెల 21న కుమార్తె జ్యోతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ తుదిశ్వాస విడిచింది. ఆసుపత్రిలో ఉన్న కూతురికి భోజనం తీసుకెళ్లూ రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందారు. తండ్రి చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే కుమార్తె చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News