ఔటర్ రింగ్ రోడ్‌ నుంచి కింద పడ్డ కారు.. ఒకరు స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఏకంగా ఓఆర్ఆర్‌పై నుంచి కింద పడింది.

Update: 2024-02-20 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా నార్సింగి ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఏకంగా ఓఆర్ఆర్‌పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలిసిన హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News