ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

ఆదివారం అర్ధరాత్రి యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాజహాన్ పూర్ జిల్లా ఖుతార్ దగ్గర వేగంగా వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీ కొన్నాయి.

Update: 2024-05-26 01:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం అర్ధరాత్రి యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాజహాన్ పూర్ జిల్లా ఖుతార్ దగ్గర వేగంగా వెళ్తున్న బస్సు- ట్రక్కు ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 11 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే ఘటనపై ప్రత్యక్ష సాక్షులను వివరాలు అడిగి తెలుసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటనలో చనిపోయిన వారి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News