ఛత్తీస్​ఘడ్​లో ఎన్​కౌంటర్​

ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రం బీజపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Update: 2024-05-23 14:48 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్​ఘడ్​ రాష్ట్రం బీజపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుమారు వెయ్యి మంది భద్రతా బలగాలు అబుజ్మడ్ దండకారణ్యంను జల్లెడ పడుతున్నారు. దంతెవాడ, బస్తర్, నారాయణపూర్ జిల్లాలలో మావోల కోసం భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది. 

Similar News