BREAKING: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం

అతివేగంతో కారును బస్సు ఢీకొనగా.. ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన కాకినాడ జిల్లా రామవరం సమీపంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

Update: 2024-05-27 02:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: అతివేగంతో కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనగా.. ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన కాకినాడ జిల్లా రామవరం సమీపంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నుంచి ఇద్దరు కారులో విజయనగరం బయలుదేరారు. ఈ క్రమంలోనే వారు రామవరం వద్దకు రాగానే కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను అత్యంత కష్టం మీద బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను విజయనగరం వాసులుగా గుర్తించారు.  

Tags:    

Similar News