BREAKING: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కారు బీభత్సం.. ఒకరు దుర్మరణం, నలుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ఇవాళ కారు బీభత్సం సృష్టించింది.

Update: 2024-02-25 05:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ఇవాళ కారు బీభత్సం సృష్టించింది.విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఐదుగురు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడ వద్ద కారు అదుపుతప్పి మొదట డివైడర్‌ను, అనంతరం ఆగి ఉన్న లారీని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.  

Tags:    

Similar News