పిడుగుపాటుకు బాలుడి మృతి..

ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. పిడుగులు పడేటట్టు ఉన్నాయి.

Update: 2024-05-26 12:56 GMT

దిశ,తెల్కపల్లి: ఉరుములు, మెరుపులు వస్తున్నాయి, పిడుగులు పడేటట్టు ఉన్నాయి. వెంటనే చెట్టు కిందికి వెళ్ళు అని తండ్రి చెప్పిన మాట పిడుగుపాటు ఆయి ఓ బాలుడి ప్రాణాలు తీసింది. వివరాలలోకి వెళితే తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, అతని కుమారుడు లక్ష్మణ్(13) ఆదివారం గ్రామ సమీపంలో ఉన్న పొలాలలోకి మేకలను మేపడానికి వెళ్లారు. సాయంత్రం తర్వాత భారీ ఈదురు గాలులు.. ఉరుములు.. మెరుపులతో వర్షం ప్రారంభం అయ్యింది. తన కుమారుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని భయపడి.. పిడుగులు పడేటట్లున్నాయి బిడ్డ వెంటనే ఆ చెట్టు కిందకు వెళ్ళు అని చెప్పాడు. దీంతో ఆ బాలుడు చెట్టు కిందకు వెళ్ళగానే పెద్ద ఎత్తున ఉరుము .. మెరుపులతో బాలుడు కూర్చున్న చెట్టుపై పిడుగు పడింది. పైగా బాలుని వద్ద సెల్ ఫోన్ ఉండడంతో ఆ ఫోన్ కూడా పేలి బాలుడి ప్రాణాలను తీసింది. నా కొడుకుకు ప్రమాదం జరగకూడదు అని చెట్టు కిందకు పంపిస్తే.. ప్రాణాలు పోయాయి కదా అని ఆ తండ్రి పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.. విషయం తెలిసిన వెంటనే కొంతమంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Similar News