గంజాయితో పట్టుబడిన బీహారీ యువకుడు

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న బీహారీ యువకుడిని జిల్లా ఎక్సైజ్ టాస్క్ పోర్స్ పోలీస్ లు పట్టుకున్నారు.

Update: 2024-05-23 11:15 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న బీహారీ యువకుడిని జిల్లా ఎక్సైజ్ టాస్క్ పోర్స్ పోలీస్ లు పట్టుకున్నారు. గురువారం నిజామాబాద్​ ఎక్సైజ్ సూపరింటెండెంట్​ మల్లారెడ్డి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ నిజామాబాద్ సీఐ విలాస్ ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నపల్లి రోడ్డు వద్ధ తనిఖీలు నిర్వహించారు. డీజే & సన్స్ వే బ్రిడ్జి సమీపంలో బీహార్ రాష్ట్రానికి చెందిన రుదల్ శర్మ అనే యువకుడి వద్ద ఉన్న బ్యాగులో 1200 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. దాంతో అతడిని అదుపులోకి తీసుకొని 1200 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం రుదల్ శర్మను అరెస్ట్ చేసి ఎస్హెచ్ఓ నిజామాబాద్ లో అప్పజెప్పారు. ఈ దాడులలో ఎక్సైజ్ సీఐ విలాస్ కుమార్ , సిబ్బంది సలీం, సాగర్ రావ్, కిరణ్ కుమార్, నీలిరాజు, నర్సయ్య చారి, గోపి పాల్గొన్నారు. 

Similar News