అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో 216(ఏ) నెంబర్ గల జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-05-07 08:09 GMT

దిశ ప్రతినిధి,అమలాపురం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో 216(ఏ) నెంబర్ గల జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీను నాయక్ నేతృత్వంలో స్టాటిక్ సర్క్యులేషన్ టీం ఇంచార్జ్ కె.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం రాజానగరం నుంచి అమలాపురం వైపుగా ఏపీ 39 ఎల్ క్యూ 2772 నెంబరు గల కారులో 15,600 రూపాయల విలువ గల 180 ఎంఎల్ సామర్థ్యంతో ఉన్న 104 కోటర్ బాటిల్స్ ను స్వాధీనపరుచుకున్నామన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలియజేశారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం,నగదు వంటి తదితర వస్తువులను సరైన ఆధారాలు లేకుండా తరలించినచో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏఎస్ఐ సూర్యచంద్రరావు, సిఐఎస్ఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News