రైలు పట్టాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు పట్టాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2024-05-26 15:56 GMT

దిశ, మనోహరాబాద్ : రైలు పట్టాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కామారెడ్డి రైల్వే ఎస్సై తను నాయక్ తెలి పిన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్, మనోహరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్యలో ఉన్న మండలంలోని రామయ్య పల్లి గ్రామ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద 55 సం వత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసుగల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించామన్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టగలిగితే కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Similar News