వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్ట్...

మెట్ పల్లి పట్టణంలో గత మంగళవారం జరిగిన సింగం మమత హత్య కేసులో నిందితుడు షేక్ అప్సర్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-05-23 14:03 GMT

 దిశ, మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలో గత మంగళవారం జరిగిన సింగం మమత హత్య కేసులో నిందితుడు షేక్ అప్సర్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలితో నిందితుడు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండగా, సోమవారం అర్ధరాత్రి మృతురాలి పై అనుమానంతో అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి మమతను చున్నీ, కేబుల్ వైర్ తో గొంతు నులిమి కత్తితో పొడిచి హత్య చేసినట్లు డీఎస్పీ ఉమా మహేశ్వర్ తెలిపారు. .నిందితునిపై సెక్షన్ 302 మర్డర్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మెట్ పల్లి సీఐ నవీన్,ఎస్ఐ చిరంజీవి పాల్గొన్నారు.

Similar News