ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరి మృతి

ముందు వెళ్తున్న లారీని డీసీఎం ఢీ కొనడంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

Update: 2024-05-24 15:22 GMT

దిశ, రాజేంద్రనగర్ : ముందు వెళ్తున్న లారీని డీసీఎం ఢీ కొనడంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బి.యన్.రెడ్డి ప్రాంతానికి చెందిన శిశుపాల్ రెడ్డి (49) శంషాబాద్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు డీసీఎం లో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఎగ్జిట్ నెంబర్ 18 వద్ద ముందు వెళ్తున్న లారీని డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎం నడుపుతున్న శిశుపాల్ రెడ్డి కడుపులో స్టీరింగ్ బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో డీసీఎం తో పాటు లారీ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాహనాలను అక్కడి నుంచి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News