ఈదురుగాలులకు బైక్‌పై పడిన చెట్టు.. వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఈదురు గాలులకు కురిసిన

Update: 2024-05-26 12:48 GMT

దిశ, కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఈదురు గాలులకు కురిసిన వర్షానికి తిమ్మాయిపల్లి నుంచి శామీర్‌పేట్ వెళ్లే దారిలో గాలి దుమారానికి చెట్టు విరిగి ఒక ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే వాహనం పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని శ్రీకర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన వ్యక్తి నాగిరెడ్డి రామ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ధనుంజయలు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు.

Similar News