లారీ ఢీకొని స్టాఫ్ నర్స్ మృతి
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ మహిళను వెనుక నుంచి లారీ ఢీటొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ మహిళను వెనుక నుంచి లారీ ఢీటొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సీఐ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీలోని రవి హాస్పిటల్లో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తున్న ప్రశాంతి తన స్కూటీపై కేపీహెచ్‌బీ కాలనీ నుంచి కూకట్పల్లి వైపునకు వెళుతుండగా వెనుక నుంచి మితి మీరిన వేగంతో వచ్చిన లారీ ప్రశాంతి ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు సీఐ కృష్ణమోహన్ తెలిపారు.