మస్కట్ లో కామారెడ్డి జిల్లా వాసి మృతి

ఉపాధి కోసం దుబాయి వెళ్లిన ఓ తెలుగు వ్య‌క్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Update: 2024-05-26 16:17 GMT

దిశ, తాడ్వాయి : ఉపాధి కోసం దుబాయి వెళ్లిన ఓ తెలుగు వ్య‌క్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన దాసరి నర్సింలు (41) ఉపాధి కోసం మస్కట్ వెళ్లి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని అన్నారు. ఉపాధి కొరకు నెల రోజుల క్రితం మస్కట్ వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

     మ‌ర‌ణ‌వార్త విన్న కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరవుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగి 12 రోజులు కావస్తున్నా మృతదేహం స్వదేశానికి రాలేదని తెలిపారు. కడసారి చూపు కోసం నర్సింలు మృతదేహన్ని స్వ‌స్థ‌లానికి తీసుకురావాలని ప్రజా ప్రతినిధులను, అధికారులను వారు కోరుతున్నారు. కాగా మృతుడికి పదమూడు సంవత్సరాల కుమారుడు, పదకొండు సంవత్సరాల కూతురు ఉన్నారు.  

Similar News