గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన

Update: 2024-05-22 16:16 GMT

దిశ, జగిత్యాల టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణంలో ఎలుక బావి ప్రాంతానికి చెందిన పల్లంకొండ రాజయ్య (60) తన కొడుకు తో కలిసి ఇంటి ముందు ఉన్న సమయంలో అతి వేగంగా వచ్చిన గుర్తు తెలియని మారుతి వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో రాజయ్య అక్కడిక్కడే మృతి చెందగా కొడుకు తప్పించుకున్నాడు. అలాగే రాజయ్య సమీపం లో ఉన్న అదే ప్రాంతానికి చెందిన కండపల్లి పోచయ్య కూడా ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం లో ద్విచక్రవాహనం కూడా డ్యామేజ్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్లు పట్టణ ఎస్సై నరేష్ తెలిపారు.

Similar News